వినాయకుడికి వీడ్కోలు

Sep 19 2021 @ 00:31AM
వినాయక ఘాట్‌ వద్ద శనివారం రాత్రి నిమజ్జన కార్యక్రమంలో భక్తుల రద్దీ

కర్నూలు(కల్చరల్‌/అర్బన్‌/న్యూసిటీ/ఎడ్యుకేషన్‌/కలెక్టరేట్‌/హాస్పిటల్‌), సెప్టెంబరు 18: వినాయకుడికి శనివారం భక్తులు వీడ్కోలు పలికారు. ప్రత్యేక పూజల అనంతరం గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయక ఘాట్‌లో నిమజ్జనం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


 పాతనగరంలోని రాంభొట్ల దేవాలయం వద్ద లడ్డూ వేలం వేయగా బైరెడ్డి శబరి రూ. 53 వేలకు దక్కించుకున్నారు. 


 నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద వినాయక నిమజ్జనానికి ఊరేగింపు ఆనందోత్సవాలతో సాగింది. పాతబస్తీ ప్రాంతము నుంచి సుమారు 150 విగ్రహలు కొండారెడ్డిబురుజు మీదుగా పాతకంట్రోల్‌రూమ్‌, రాజవిహర్‌, బుదవారపేట మీదుగా వినాయక ఘాట్‌ వద్దకు చేరుకున్నాయి. విగ్రహాల ముందు చిన్నారుల విన్యాసాలు, అమ్మాయిలు చేసిన కర్రసాము ఆకట్టుకున్నాయి. వడ్డేగేరిలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద భీముడు, పార్వతి దేవి వేషధారణంలో చిన్నారులు పలువురిని ఆకట్టుకున్నారు. 


 కలెక్టరేట్‌లో నెలకొల్పిన వినాయకుడికి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. 


 కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద రోగుల సహాయకుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఓటీ అసిస్టెంట్‌ మల్లికార్జున స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక భక్త బృందం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎంవోవో డా.హేమనళిని పాల్గొన్నారు. 


 వినాయక ఘాట్‌లో గణేశ్‌ ప్రతిమల నిమజ్జనోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో, జానపద నృత్య ప్రదర్శనలతో ఆహుతులను అలరింపజేశారు. ఘాట్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలకు హనుమాన్‌ కళాసమితి అధ్యక్షుడు పి. హనుమంతరావు చౌదరి, నాగరాజు పర్యవేక్షించారు.  

నిమజ్జనానికి ఊరేగింపుగా వస్తున్న వినాయకులు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.