Kanpur లో Violence.. ఆరుగురికి గాయాలు, పలువురి అరెస్టు

ABN , First Publish Date - 2022-06-04T00:51:37+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో శుక్రవారం ప్రార్థనల అనంతరం హింసాకాండ చెలరేగింది. రెండు వర్గాలకు చెందిన వారు...

Kanpur లో Violence.. ఆరుగురికి గాయాలు, పలువురి అరెస్టు

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో శుక్రవారం ప్రార్థనల అనంతరం హింసాకాండ చెలరేగింది. పరేడ్ మార్కెట్‌లోని దుకాణాలు మూసేయాలని ఒక వర్గం వారు పిలుపునిచ్చారు. దీనికి ఆ ప్రాంతంలోని రెండవ వర్గం వారు అభ్యంతరం చెప్పారు. దీంతో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రావడంతో వారిపై కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణల్లో సుమారు ఆరుగురు గాయపడ్డారు. 16 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.  గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో సీనియర్ పోలీస్ అధికారికి  కైలాష్ దూబే కూడా ఉన్నారు.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ సీనియర్ నేత ఒకరు జాతీయ టెలివిజన్‌లో మహమ్మద్ ప్రవక్తను చిన్నబుచ్చేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు దుకాణాలు మూసివేశారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ క్రమంలోనే బెకాన్‌గంజ్ ఏరియాలో స్థానికులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. తొలుత పరిస్థితి అదుపులోనికి వచ్చినప్పటి కనిపించినప్పటికీ రెండుసార్లు కాల్పుల శబ్దాలు చోటుచేసుకోవడంతో తిరిగి హింస మొదలైంది. స్థానికులు రాళ్లు రువ్వడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ప్రస్తుతం రాళ్లు రువ్వుడు ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జాయింట్ పోలీస్ కమిటిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారీ తెలిపారు. 

Updated Date - 2022-06-04T00:51:37+05:30 IST