అవినీతి తిమింగలంగా విప్‌ కాపు ఖ్యాతి: కాలవ

ABN , First Publish Date - 2021-12-03T06:32:15+05:30 IST

అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోని విప్‌ కాపు రామచంద్రారెడ్డి.. జిల్లా రాజకీయాల్లో అవినీతి తిమింగలంగా గొప్ప పేరు సంపాదించుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

అవినీతి తిమింగలంగా విప్‌ కాపు ఖ్యాతి: కాలవ
చార్జ్‌షీట్‌ను విడుదల చేస్తున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

రెండున్నరేళ్ల పనితీరుపై టీడీపీ చార్జ్‌షీట్‌ విడుదల


రాయదుర్గం, డిసెంబరు 2: అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోని విప్‌ కాపు రామచంద్రారెడ్డి.. జిల్లా రాజకీయాల్లో అవినీతి తిమింగలంగా గొప్ప పేరు సంపాదించుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విప్‌ కాపు రెండున్నరేళ్ల పనితీరుపై చార్జ్‌షీట్‌ను విడుదల చేశా రు. ఈసందర్భంగా కాలవ మాట్లాడుతూ 2019లో అధికారంలోకి రాగానే వే దావతి హగరి నదిపై కన్నేసి పెద్దఎత్తున ఇసుకను కర్ణాటకకు తరలించి కో ట్ల రూపాయలు గడిస్తున్నారన్నారు. డీహీరేహాళ్‌, బొమ్మనహాళ్‌ మండలాల నుంచి ఇసుక, మట్టిని బళ్లారికి తరలించడంతో పాటు ఓబుళాపురం వద్ద వుండే ఇనుప కొండ నుంచి ఖనిజాన్ని తరలించి దోచుకుంటున్నట్లు ఆరోపించారు. శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే కాపు పేరుమీద వున్న కంకర క్వారీపై విధించిన రూ.రెండు కోట్ల పెనాల్టీని మంత్రి పెద్దిరెడ్డిపై ఒత్తిడి తె చ్చి రద్దు చేయించుకున్నారన్నారు. భైరవానతిప్ప ప్రాజెక్టుకు మూడు నెల ల్లో కృష్ణాజలాలు తెస్తానని బీరాలు పలికిన కాపు, 30 నెలలు గడిచినా అం గుళం పనికూడా చేయలేదన్నారు. రాయదుర్గానికి శాశ్వత మురుగు కాలు వ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని, గార్మెంట్స్‌ పరిశ్రమ విస్తరణలో ప్రత్యేక శ్ర ద్ధ చూపుతానని బాసలు పలికి పూర్తిగా మరచిపోయాడన్నారు. టీడీపీ హ యాంలో ప్రారంభించిన వేలాది కోట్ల రూపాయల ప్రగతి పనులు కాపు అ సమర్థత కారణంగా అర్ధంతరంగా ఆగిపోయాయన్నారు. అధికారాన్ని ఉపయోగించి నేమకల్లు వద్ద తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేరుతో అ క్రమంగా క్వారీ లైసెన్సులు తెచ్చుకుని యథేచ్ఛగా బోల్డర్లను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇతర క్వారీల్లోని బండరాళ్లను తరలించి లక్షలు విలువ చేసే యంత్రాలను కూడా ఎత్తుకెళ్లారన్న ఆరోపణలున్నాయన్నారు. కర్ణాటక నుంచి అక్రమ మద్యం తెచ్చి ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. చివరికి హెచ్చెల్సీ కాలువకు పంటలు కాపాడుకునేందుకు మోటార్లు పెట్టుకున్న రై తుల నుంచి కూడా మామూళ్లు వసూలు చేసుకునే స్థాయికి దిగజారారని ఆరోపించారు. అంతేకాకుండా నేరగ్రస్త మనస్తత్వం వున్న కాపు వల్ల ఎప్పు డు ఎవరికి ఏరూపంలో హాని జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.     


Updated Date - 2021-12-03T06:32:15+05:30 IST