Viral News: గాళ్‌ఫ్రెండ్‌కు షాకిచ్చిన యువకుడు.. ఇకపై నన్ను నీ పెద్ద అన్న అనుకో అంటూ బ్రేకప్ లెటర్!

ABN , First Publish Date - 2022-07-07T23:32:55+05:30 IST

ఓ యువకుడు తన గాళ్‌ఫ్రెండ్‌కు షాకిచ్చాడు. ఇకపై నన్ను నీ పెద్ద అనుకో అంటూ బ్రేకప్ చెప్పేశాడు. ప్రస్తుతం అతడు బ్రేకప్ చెప్పిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. తమకు తోచిన విధంగా కామెంట్ల వర్షం కురిపి

Viral News: గాళ్‌ఫ్రెండ్‌కు షాకిచ్చిన యువకుడు.. ఇకపై నన్ను నీ పెద్ద అన్న అనుకో అంటూ బ్రేకప్ లెటర్!

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడు తన గాళ్‌ఫ్రెండ్‌కు షాకిచ్చాడు. ఇకపై నన్ను నీ పెద్ద అనుకో అంటూ బ్రేకప్ చెప్పేశాడు. ప్రస్తుతం అతడు బ్రేకప్ చెప్పిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. తమకు తోచిన విధంగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



సుజన్ అనే యువకుడు సుప్రియ అనే తన గాళ్‌ఫ్రెండ్‌కు రాసిన బ్రేకప్‌ లెటర్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ లెటర్‌లో.. ‘ప్రియమైన మాజీ గాళ్‌ఫ్రెండ్.. ఈ 21శతాబ్దంలో నా లాంటి వ్యక్తి నీ లాంటి కన్నింగ్ అమ్మాయిని ప్రేమించే ధైర్యం చేయడు. అందువల్ల నేను మన ప్రేమకు ముగింపు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నా. ఇన్ని రోజుల మన పరిచయంలో ఒక వేళ నేను ఏమైనా తప్పులు చేసుంటే.. నన్ను మీ పెద్ద అన్న అనుకుని వాటిని మన్నించు. ఇట్లు ప్రస్తుతం నీ పెద్దన్న సుజన్’ అని ఉండటంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ‘బాగా బ్రేకప్ చెప్పావ్’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘ఇంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. ఇపుడు అన్ననుకో అంటావేంటి బ్రదర్’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2022-07-07T23:32:55+05:30 IST