తెలంగాణలో పంజా విసురుతున్న విష జ్వరాలు

ABN , First Publish Date - 2021-09-14T01:00:13+05:30 IST

తెలంగాణలో పంజా విసురుతున్న విష జ్వరాలు

తెలంగాణలో పంజా విసురుతున్న విష జ్వరాలు

హైదరాబాద్: తెలంగాణలో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. అన్ని జిల్లాల్లో డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్ కేసుల సంఖ్య పెరిగాయి. కరోనాను మించి కేసులు నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు డెంగీ, మలేరియా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పల్లె నుంచి పట్నం దాకా వాడవాడలా జ్వరాలు విజృంభిస్తున్నాయి. దగ్గు, తలనొప్పి లక్షణాలు కనిపిస్తుండటంతో రోగుల్లో కరోనా భయం పట్టుకుంది. కొన్ని చోట్ల మరణాలు సంభవిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఒక్కో బెడ్‌పై ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అటు ఏజెన్సీ జనం కూడా జ్వరాలతో విలవిలలాడుతున్నారు. జ్వరం ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. 



Updated Date - 2021-09-14T01:00:13+05:30 IST