Viral Photo: మహిళలకు శుభవార్త...ప్రత్యేకంగా పార్కింగ్ స్పాట్స్

ABN , First Publish Date - 2022-09-08T18:15:43+05:30 IST

మహిళలకు(womens) శుభవార్త(good news)...

Viral Photo: మహిళలకు శుభవార్త...ప్రత్యేకంగా పార్కింగ్ స్పాట్స్

మహిళలకు(womens) శుభవార్త(good news)...మహిళల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్పాట్లను కేటాయించిన( reserved only for women) చిత్రాలు సోషల్ మీడియాలో తాజాగా హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడిట్‌లో పోస్టు చేసిన మహిళల పార్కింగ్ స్పాట్(Special Parking Spots) చిత్రాలు వైరల్‌గా(Viral Photo) మారాయి. దక్షిణ కొరియా(South Korea), చైనా(china), జర్మనీ(Germany) దేశాల్లో షాపింగ్ మాల్స్‌లలో పింక్ కలర్ పార్కింగ్ స్పాట్లను కేటాయించారు.పింక్ కలర్ పార్కింగ్ స్పాట్లను కేవలం మహిళల వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. సోషల్ మీడియా పోస్టుకు 28వేల మందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు. 


ఈ పోస్టుపై పలు కామెంట్స్ వెల్లువెత్తాయి. ఈ రిజర్వుడ్ పార్కింగ్ స్పాట్లు గర్భిణులు, పిల్ల తల్లులకు అని ఓ నెటిజన్ కామెంటు చేశారు. మహిళల భద్రత కోసం ఈ ప్రత్యేక పార్కింగ్ స్పాట్లు(Parking Spots) అని మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ లాట్లు కేటాయించే ఆలోచన బాగుందని(good idea) పలువురు వ్యాఖ్యానించారు.దక్షిణ కొరియా రాజధాని నగరమైన సియోల్‌లో 2014లో మహిళల ఫ్రెండ్లీ పేరిట ప్రత్యేకంగా పార్కింగ్ స్పాట్లను ప్రారంభించారు.


మహిళల కోసం షి స్పాట్లను(she-spots) కేటాయించడానికి దక్షిణ కొరియా 100 మిలియన్ డాలర్లను వెచ్చించింది. జర్మనీ దేశంలోని త్రిబెగ్ పట్టణంలో 2012వ సంవత్సరం మహిళల కోసం ప్రత్యేక పార్కింగ్ స్పాట్లను కేటాయించారు.కువైట్, మలేషియా, ఆస్ట్రియా, ఇటలీ దేశాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్పాట్లను కేటాయించారు.   


Updated Date - 2022-09-08T18:15:43+05:30 IST