Viral Story: 90 ఏళ్ల వయసులోనూ వెనకడుగు వేయని బామ్మ.. ఆమె ఔదార్యానికి నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2022-07-29T21:23:45+05:30 IST

ఆ బామ్మ వయసు 90 ఏళ్లు.. ఆ వయసుకు చాలా మంది రకరకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఇతరుల మీద ఆధారపడి జీవిస్తుంటారు..

Viral Story: 90 ఏళ్ల వయసులోనూ వెనకడుగు వేయని బామ్మ.. ఆమె ఔదార్యానికి నెటిజన్లు ఫిదా!

ఆ బామ్మ వయసు 90 ఏళ్లు.. ఆ వయసుకు చాలా మంది రకరకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఇతరుల మీద ఆధారపడి జీవిస్తుంటారు.. అయితే ఆ బామ్మ మాత్రం అలా నిస్తేజంగా ఉండిపోవడం లేదు.. నోరు లేని మూగజీవాలకు ఆసరాగా నిలుస్తోంది.. రోజూ తెల్లవారు ఝామునే 4:30కు నిద్రలేచి వీధి కుక్కల (stray dogs) కోసం ఆహారం సిద్ధం చేస్తోంది.. ఆ ఆహారాన్ని తీసుకెళ్లి స్వయంగా వీధి కుక్కల చేత తినిపిస్తోంది.. ఆమె స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

Gold smuggling: విమానంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. ఓ సీటు కింద కనిపించిందో పార్శిల్.. అనుమానంగానే దాన్ని ఓపెన్ చేసి చూస్తే..!


ముంబై(Mumbai) కి చెందిన కనక్ (90) అనే బామ్మ వీధి కుక్క‌ల కోసం ప్ర‌తి రోజూ ఉద‌యం 4.30 గంట‌లకే నిద్ర లేచి ఆహారం త‌యారుచేస్తోంది. వాటి చేత స్వయంగా తినిపిస్తోంది. మొదట్లో ఆమెకు కుక్కలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట. అయితే త‌న మ‌న‌మ‌రాలు స‌నా ఓ కుక్క‌ను తీసుకువ‌చ్చిన త‌ర్వాతే ఆమెలో ఈ మార్పు వ‌చ్చింద‌ట. మనవరాలు తీసుకొచ్చిన పెంపుడు కుక్క‌కు `కొకో` అని పేరు పెట్టుకున్నామ‌ని, ఇప్పుడు దానితోనే త‌న కాలక్షేపం అని కనక్ చెబుతున్నారు.  


కొకోతో పాటు త‌మ వీధిలోని ఇత‌ర కుక్క‌ల‌కు ఆహారం సిద్ధం చేయ‌డానికి రోజు కనక్ తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కే నిద్ర లేస్తారు. కనక్ మనవరాలు వీధి కుక్కల కోసం ఓ షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు వాటికి ప్రతి ఏడాది వ్యాక్సినేషన్ కూడా చేయిస్తారు. మనవరాలికి తోడుగా ఆ బామ్మ కూడా తన వంతు సహాయంగా వీధి కుక్కలకు ఆహారం అందజేస్తోంది. వృద్ధాప్యంలో కూడా ఆ బామ్మ వీధి కుక్క‌ల ప‌ట్ల చూపుతున్న ఔదార్యాన్ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.



Updated Date - 2022-07-29T21:23:45+05:30 IST