Viral Video: వరుడితో పాటూ గుర్రమెక్కాడు.. చిందులేస్తూ డబ్బులు వెదజల్లాడు.. అంతలోనే..!

ABN , First Publish Date - 2021-10-08T01:11:25+05:30 IST

పెళ్లిలో అందరూ సందడి సందడిగా ఉంటారు. అయితే మరోవైపు వరుడి స్నేహితుల అల్లరి మామూలుగా ఉండదు. స్నేహితుడిని ఆట పట్టిస్తూ కొందరు.. జనాన్ని ఆకట్టుకోవాలని ఇంకొందరు.. రకరకాల స్టంట్‌లు చేస్తుంటారు.

Viral Video: వరుడితో పాటూ గుర్రమెక్కాడు.. చిందులేస్తూ డబ్బులు వెదజల్లాడు.. అంతలోనే..!

పెళ్లిలో అందరూ సందడి సందడిగా ఉంటారు. అయితే మరోవైపు వరుడి స్నేహితుల అల్లరి మామూలుగా ఉండదు. స్నేహితుడిని ఆట పట్టిస్తూ కొందరు.. జనాన్ని ఆకట్టుకోవాలని ఇంకొందరు.. రకరకాల స్టంట్‌లు చేస్తుంటారు. కొన్ని సార్లు అవి విఫలమై.. అందరి ముందు నవ్వులపాలవుతుంటారు. ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఓ పెళ్లి కార్యక్రమంలో వరుడిని గుర్రంపై ఊరేగిస్తున్నారు. చుట్టు పక్కల వారంతా గోలగోల చేస్తున్నారు. ఇదే కదా సమయం అనుకున్నాడో ఏమో.. ఓ వ్యక్తి వరుడి గుర్రంపైకి ఎక్కేశాడు. అంతా చూస్తుండగా.. ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నించాడు. కొద్దిసేపు తన జేబులోని డబ్బులను జనాలపైకి వెదజల్లాడు. డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇతడి ప్రదర్శనను అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.


ఈ క్రమంలో అతడు రెచ్చిపోయి.. ఇంకొంచెం ఎక్కువ చేశాడు. తర్వాత జరిగిన ఘటన అతన్ని.. నవ్వులపాలు చేసింది. మంచి ఊపు మీద డ్యాన్స్ చేస్తున్న అతడు.. ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడ్డాడు. ఇంకేముందీ.. అంతా పక్కున నవ్వడం మొదలెట్టేశారు. అతడు కిందపడింది కాకుడా.. పెళ్లి కొడుకుని కూడా కిందపడేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చూసిన వారంతా వివిధ రాకలుగా కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2021-10-08T01:11:25+05:30 IST