Moving Car Catches Fire: ఒక్కసారిగా కారులో మంటలు.. గబుక్కున దూకి సేఫ్‌గా తప్పించుకున్న కుటుంబం!

ABN , First Publish Date - 2022-09-30T23:04:54+05:30 IST

వేగంగా వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో క్షణకాలంలోనే అప్రమత్తమైన కుటుంబం

Moving Car Catches Fire: ఒక్కసారిగా కారులో మంటలు.. గబుక్కున దూకి సేఫ్‌గా తప్పించుకున్న కుటుంబం!

న్యూఢిల్లీ: వేగంగా వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో క్షణకాలంలోనే అప్రమత్తమైన కుటుంబం ఒక్కుదుటన అందులోంచి దూకేసి ప్రాణాలు రక్షించుకుంది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తుండగా అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.  నోయిడా సెక్టర్ 15ఎ(Noida's sector 15A)లో జరిగిందీ ఘటన.


క్షణాల్లోనే మంటలు ఎగసిపడి కారును కమ్మేయడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని కారు ఆహుతి అవుతున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.  


ఇలాంటి ఘటనే కొన్ని వారాల క్రితం నోయిడా సెక్టర్-18(Noida's sector 18)లోని ఓ కంపెనీలో జరిగింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. మంటల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. అయితే, ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.



Updated Date - 2022-09-30T23:04:54+05:30 IST