Viral Video: పెళ్లి పీటల మీదే వరుడుకి తొడపాశం.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-01-04T21:07:16+05:30 IST

ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: పెళ్లి పీటల మీదే వరుడుకి తొడపాశం.. వైరల్ అవుతున్న వీడియో!

ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలోని ఫన్నీ సంఘటనలను చూసి నవ్వుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అలాంటిదే ఓ వీడియో వైరల్‌గా మారింది. పెళ్లి పీటల మీద వరుడికి తొడపాశం పెట్టిన వధువుకు సంబంధించిన వీడియో అది. 


ఆ వీడియో ప్రకారం.. పెళ్లి వేడుకలో కాబోయే భార్యకు వరుడు స్వీట్ తినిపించేందుకు ప్రయత్నించాడు. అయితే స్వీట్ తినేందుకు వధువు ఇష్టపడలేదు. అయినా వరుడు తన ప్రయత్నం మానలేదు. మరోసారి బలవంతం చేశాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. పెళ్లి పీటల మీదే వరుడికి తొడపాశం పెట్టింది. నొప్పిని భరించలేకపోయిన వరుడు చిన్నగా కేక పెట్టాడు. ఈ వీడియోను బంధువులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వధువు తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2022-01-04T21:07:16+05:30 IST