Viral Video: పెళ్లి వేడుకలో ఇతడి డాన్స్ చూసి నవ్వాపుకోలేరు.. నెట్టింట ఎన్ని ఫన్నీ కామెంట్లో..!

ABN , First Publish Date - 2022-04-22T18:04:47+05:30 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అంగరంగ వైభవంగా, కోలాహలంగా వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Viral Video: పెళ్లి వేడుకలో ఇతడి డాన్స్ చూసి నవ్వాపుకోలేరు.. నెట్టింట ఎన్ని ఫన్నీ కామెంట్లో..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అంగరంగ వైభవంగా, కోలాహలంగా వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ పెళ్లి కార్యక్రమంలో ఓ జవాన్ చేసిన మార్చ్ ఫాస్ట్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశు కబ్రా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కొద్ది గంటల్లోనే ఈ వీడియో 1.20 లక్షల వ్యూస్ దక్కించుకుంది. 

ఇది కూడా చదవండి..

వధువు ఇంటికి వరుడు చేరుకున్న మరుక్షణంలోనే ఊహించని ఘటన.. ఇద్దరు మృతి.. అసలేం జరిగిందంటే..


తన ఆర్మీ ట్రైనింగ్ పూర్తవగానే ఆ జవాన్ తన స్నేహితుడి పెళ్లి వేడుక వద్దకు చేరుకున్నాడని దీపాంశు పేర్కొన్నారు. అయితే ఆ పెళ్లి ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఆ వీడియోలో సదరు ఆర్మీ జవాన్ చాలా ఫన్నీగా మార్చ్ ఫాస్ట్ డ్యాన్స్ చేశాడు. అనంతరం సెల్యూట్ కూడా చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. `అందుకే ఆర్మీ జవాన్లకు పై అధికారులు సెలవులు ఇవ్వరు`, `కఠినమైన ట్రైనింగ్ వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు కూడా ఉంటాయి`, `డ్యాన్స్ ఎలా వెయ్యాలో తెలియనపుడు ఇలాంటి స్టెప్‌లు బయటపడతాయి` అంటూ కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2022-04-22T18:04:47+05:30 IST