Viral Video: బ్యాగ్ జిప్ తెరిచి దొంగతనం చేసి పారిపోయిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-09-19T02:25:22+05:30 IST

ఈ భూమి మీద ఉన్న తెలివైన జంతువుల జాబితాలో వానర జాతి ముందంజలో ఉంటుంది.

Viral Video: బ్యాగ్ జిప్ తెరిచి దొంగతనం చేసి పారిపోయిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ భూమి మీద ఉన్న తెలివైన జంతువుల జాబితాలో వానర జాతి ముందంజలో ఉంటుంది. కోతులు కొన్ని కొన్ని విషయాల్లో అచ్చం మనుషుల్లాగానే ప్రవర్తిస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) కోతి దొంగతనానికి పాల్పడి పారిపోయింది. మనిషి చేతిలో ఉన్న ఆహార పదార్థాలను లాక్కొని పారిపోయే కోతులను తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే ఈ వీడియోలోని కోతి ఓ వ్యక్తి బ్యాగ్ నుంచి ఆహారాన్ని (Monkey Stealing Apple) దొంగిలించింది. 


ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకుని కూర్చున్నాడు. ఒక కోతి ఆ బ్యాగ్ దగ్గరకు వెళ్లి జిప్ ఓపెన్ చేసింది. బ్యాగ్ లోపల చెయ్యి పెట్టి యాపిల్ బయటకు తీసింది. వెంటనే దానిని తీసుకుని పారిపోయింది. ఆ కోతి చేష్టలను పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  

Updated Date - 2022-09-19T02:25:22+05:30 IST