Viral Video: ఈ దంపతుల డ్యాన్స్ అదుర్స్
ABN , First Publish Date - 2022-09-08T15:25:33+05:30 IST
ఈ వీడియోలో దంపతులు అర్దరాత్రి నడిరోడ్డుపై చేసిన డ్యాన్స్ నెటిజన్లను అదుర్స్ అనిపించింది....
వీధి దీపాల కింద రోడ్డుపై దంపతుల డ్యాన్స్
న్యూఢిల్లీ: ఈ వీడియోలో దంపతులు అర్దరాత్రి నడిరోడ్డుపై చేసిన డ్యాన్స్ నెటిజన్లను అదుర్స్ అనిపించింది. నృత్యం అనేది ఓ కళ...వారిలోని అభిరుచి,సంస్కృతిని గుర్తించే డ్యాన్స్ ఒత్తిడి నివారిణిగా కూడా పనిచేస్తోంది. రాత్రివేళ ఖాళీగా ఉన్న రోడ్డుపై(Empty Road) వీధి దీపాల(Street Light) వెలుతురులో దంపతులు చేసిన డ్యాన్స్(Couple Dancing) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా(Viral Video) మారింది. సెప్టెంబరు 5వతేదీన ట్విట్టర్ యూజర్ ప్రేరణ మహేశ్వరి పోస్ట్ చేసిన ఈ వీడియోను టెర్రస్ నుంచి చిత్రీకరించారు.
ఈ వీడియోలో ఒక జంట వీధిదీపం కింద ఖాళీ రహదారిపై అద్భుతంగా డ్యాన్స్ చేయడం విశేషం. తాము చేస్తున్న డ్యాన్స్(Dance) రికార్డ్ చేస్తున్నారని వారికి తెలియదు.నెటిజన్ ప్రేరణ మహేశ్వరి షేర్ చేసిన ఈ వీడియో 1544 రీట్వీట్లు, 2,40,500 వ్యూస్ సంపాదించింది.16 సెకన్ల ఈ వీడియోపై నెటిజన్ల నుంచి పలు వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.ఈ డ్యాన్స్ వీడియోను పెద్దఎత్తున నెటిజన్లు లైక్ చేశారు.(Internet Loves)