వాల్‌మార్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
ABN , First Publish Date - 2021-07-05T02:36:15+05:30 IST
అమెరికాలోని ఓ వాల్‌మార్ట్‌ను అనుకోని అతిథి సందర్శించింది. దీంతో అక్కడి సిబ్బంది కంగుతిన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వె
వాషింగ్టన్: అమెరికాలోని ఓ వాల్‌మార్ట్‌ను అనుకోని అతిథి సందర్శించింది. దీంతో అక్కడి సిబ్బంది కంగుతిన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విస్కాన్సిన్ వాల్‌మార్ట్‌లోకి అకస్మాత్తుగా ఓ జింక ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఉన్న జనాన్ని, పరిసరాలను చూసి అది బెదిరిపోయింది. ఈ క్రమంలో ఉరుకులు పరుగులు తీసుకుంది. దీంతో షాపులోని కొంత సామాగ్రి ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలోనే వాల్‌మార్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఆ జిక్కను కట్టడి చేశారు. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడయాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ప్రస్తుతం వైరల్ అయింది.