నోరు పారేసుకోవద్దు.. కోహ్లీ మళ్లీ మీ నోళ్లు మూయిస్తాడు: అభిమానులు

ABN , First Publish Date - 2022-06-07T22:29:58+05:30 IST

విరాట్ కోహ్లీ..అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టాక్ ఆఫ్ ది క్రికెట్ అవుతూనే ఉన్నాడు. అయితే

నోరు పారేసుకోవద్దు.. కోహ్లీ మళ్లీ మీ నోళ్లు మూయిస్తాడు: అభిమానులు

ముంబై: విరాట్ కోహ్లీ..అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టాక్ ఆఫ్ ది క్రికెట్ అవుతూనే ఉన్నాడు. అయితే కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఫేస్ చేస్తున్నాడు. 2019 నుంచి కోహ్లీ ఒక సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో మాజీలు ఆడేసుకుంటున్నారు. రన్‌మిషన్ పనైపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సవాళ్లను ఎదుర్కోవడం ఎలాగో కోహ్లీకి తెలుసన్న విషయాన్ని మరిచిపోతున్నారు. ఎందుకంటే విమర్శలు వచ్చిన ప్రతిసారీ.. విరాట్  దెబ్బతిన్న పులిలా అదరగొట్టాడు. విమర్శలకు ఆటతీరుతోనే ఆన్సర్ ఇచ్చాడు. తనలోని ఫైర్‌ను చూపించాడు. 


కోహ్లీ అలా ఫైర్ చూపించిన ఇన్నింగ్స్‌ను ఫ్యాన్స్ ఇప్పుడు  గుర్తు చేస్తున్నారు. నిజానికి మొన్నటి ఐపీఎల్ సీజన్‌లోనూ ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఫామ్‌పై హాట్ డిబేట్ జరిగింది. రెస్ట్‌ తీసుకోవాల్సిందే అని కొందరు సలహాలు కూడా ఇచ్చిపడేశారు. అయితే ఐపీఎల్‌ పదిహేనో సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరాలంటే..కచ్చితంగా రాణించాల్సిన టైమ్‌లో విరాట్ సూపర్ ఇన్నింగ్స్‌ ఆడాడు. 73 పరుగులతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2018-19వ సీజన్‌లో ఆసీస్ గడ్డ మీద జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ కోహ్లీ విమర్శలు ఫేస్ చేశాడు. అప్పట్లో తొలి టెస్ట్‌లో విరాట్ ఫెయిలవడంతో కొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారు.


అయితే ఆ తర్వాత పెర్త్‌లో జరిగిన టెస్ట్‌లో కోహ్లీ సెంచరీతో వీరవిహారం చేశాడు. ఒత్తిడిని తట్టుకుని పేస్ పిచ్ మీద ఆసీస్ బౌలర్లను ఉతికేశాడు. బ్యాట్‌తోనే విమర్శకులకు గట్టిగా సమాధానం చెప్పాడు. 2014లో ఇంగ్లండ్ టూర్‌లోనూ  విరాట్ ఫెయిలయ్యాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 135 పరుగులే చేశాడు. దీంతో స్వింగ్ బౌలింగ్‌ను కోహ్లీ ఫేస్ చేయలేడనే కామెంట్స్ వినిపించాయ్.  అయితే 2018లో మాత్రం లెక్క సరిచేశాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కూడా ఆడగలనని సెంచరీలతో ప్రూవ్ చేసుకున్నాడు. 2014-15 సీజన్‌లో ఆసీస్ గడ్డ మీద టెస్ట్ సిరీస్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు.


విజిటింగ్ బ్యాటర్‌గా అనేక రికార్డులు కొల్లగొట్టాడు. కెరీర్ ఆరంభంలో విరాట్ టెస్ట్ మెటీరియల్ కాదనే విమర్శలు వచ్చాయ్. కానీ అడిలైడ్‌లో డ్రీమ్ సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇప్పుడు కూడా విరాట్ మళ్లీ టచ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. కంట్రోల్‌లో ఉండండి..విరాట్ మీ నోళ్లు మూయిస్తాడంటూ..విమర్శకులకు వార్నింగ్ ఇస్తున్నారు.

Updated Date - 2022-06-07T22:29:58+05:30 IST