
ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌పై పాకిస్థాన్ స్టార్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) స్పందించాడు. కోహ్లీ గొప్ప ఆటగాడని, బాగా కష్టపడే ప్లేయర్ అని అన్నాడు. అతడు తన కెరియర్‌లో ఎన్నో సాధించాడని ప్రశంసించాడు. అయితే, ప్రస్తుతం అతడు క్లిష్ట దశలో ఉన్నాడని అన్నాడు. అతడు మళ్లీ ఫామ్ అందుకోవాలని ఆకాంక్షించాడు. అతడి కోసం ప్రార్థిస్తానని చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌లో కోహ్లీ చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. ‘‘అతడో చాంపియన్ ప్లేయర్. కానీ ఇప్పుడీ పరిస్థితుల్లో మనం అతడి గురించి ప్రార్థన మాత్రమే చేయగలం’’ అని రిజ్వాన్ అన్నాడు. కష్టాలు వస్తుంటాయని, పరిస్థితులు మళ్లీ చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎంతోమంది సెంచరీలు కొట్టారని, ఇది కొనసాగుతుందని అన్నాడు. కోహ్లీ కోసం తాను కేవలం ప్రార్థించగలనని చెప్పుకొచ్చాడు. మరింత కష్టపడి పరిస్థితులను తన నియంత్రణలోకి తెచ్చుకుంటాడని రిజ్వాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి