విరాట్ కోహ్లీ బ్యాడ్ కెప్టెనా?.. విండీస్ మాజీ దిగ్గజం క్లైవ్ లాయిడ్ ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2021-11-10T02:42:21+05:30 IST

టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టీ20 సారథ్యం ముగిసింది. అతడి సారథ్యంలో అద్భుత

విరాట్ కోహ్లీ బ్యాడ్ కెప్టెనా?.. విండీస్ మాజీ దిగ్గజం క్లైవ్ లాయిడ్ ఏమన్నాడంటే..

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టీ20 సారథ్యం ముగిసింది. అతడి సారథ్యంలో అద్భుత విజయాలను సొంతం చేసుకున్న భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు కూడా చేరుకోలేకపోయింది. టీ20 సారథిగా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేకపోయిన కోహ్లీ చుట్టూ విమర్శలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో లెజండరీ వెస్టిండీస్ కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్.. కోహ్లీకి అండగా నిలిచాడు.


కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సాధించలేకపోయినప్పటికీ అతడి సారథ్యంలో ఇండియన్ క్రికెట్ ఉన్నత స్థానాలకు చేరుకుందని అన్నాడు. కోహ్లీ నుంచి అభిమానులు ఎంతగానో ఆశిస్తారని, వారి అంచనాలను అందుకోలేకపోయినప్పుడు విమర్శించడం సహజమేనన్నాడు.


‘‘భారత జట్టుకు సంవత్సరాలపాటు అద్భుతంగా ఆడాడు. ప్రపంచకప్ అందించలేకపోయినంత మాత్రాన అతడేమీ బ్యాడ్ కెప్టెన్ కాదు’’ అని పేర్కొన్నాడు. అతడి బ్యాట్ నుంచి మళ్లీ బెస్ట్ ఇన్నింగ్స్ వస్తుందన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో టీమిండియా ఒకటని ప్రశంసించిన లాయిడ్.. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో పుంజుకుంటుందని లాయిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Updated Date - 2021-11-10T02:42:21+05:30 IST