Virat Kohli: టీ20 ప్రపంచకప్‌‌లో కోహ్లీ ఓపెనర్‌గా వస్తాడా.. రోహిత్ శర్మ ఏం చెప్పాడు?

ABN , First Publish Date - 2022-09-18T22:24:37+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్న రోహిత్ శర్మ (rohit sharma) సారథ్యంలోని టీమిండియా అంతకుముందు

Virat Kohli: టీ20 ప్రపంచకప్‌‌లో కోహ్లీ ఓపెనర్‌గా వస్తాడా.. రోహిత్ శర్మ ఏం చెప్పాడు?

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్న రోహిత్ శర్మ (rohit sharma) సారథ్యంలోని టీమిండియా అంతకుముందు ఆస్ట్రేలియా (australia)తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ నెల 20న మొహాలీలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా రోహిత్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ(virat kohli)ని ఓపెనర్‌గా పంపే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఆసియాకప్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ జోరుమీదున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో 61 బంతుల్లోనే అజేయ సెంచరీ (122) పరుగులు సాధించాడు. టీ20ల్లో భారత్ తరపున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా. 


ఆప్షన్లు ఉండడమనేది ఎప్పుడూ మంచి విషయమేనని పేర్కొన్న రాహుల్.. ప్రపంచకప్‌కు వెళ్తున్న సమయంలో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండడం చాలా అవసరమని అన్నాడు. ప్లేయర్లు ఏ స్థానంలోనైనా ఆడేలా ఉండాలని పేర్కొన్నాడు. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నప్పుడు అది మరో సమస్య కాకూడదని రోహిత్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల నాణ్యతను, వారు ఏం ఇవ్వబోతున్నారన్న విషయాన్ని తాము అర్థం చేసుకోవాలని రోహిత్ పేర్కొన్నారు. కోహ్లీని ఓపెనర్‌గా పంపడం తమకు ఓ ఆప్షన్ అని అన్నాడు. ఐపీఎల్‌లో కోహ్లీ తన ఫ్రాంచైజీకి ఆడుతూ ఓపెనర్‌గా దిగిన విషయాన్ని రోహిత్ గుర్తు చేశాడు. ఓపెనర్‌గా కోహ్లీ రాణించాడని, కాబట్టి అది తమకు తప్పకుండా కచ్చితమైన ఆప్షన్ అవుతుందని వివరించాడు. 


రోహిత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే కోహ్లీ కోసం ఓపెనర్ కేఎల్ రాహుల్ తన స్థానాన్ని వదులుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయమై ఆసియా కప్‌లో రాహుల్‌ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దానికి రాహుల్ ఆ జర్నలిస్టుపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ‘‘అంటే నన్ను పక్కన పెట్టాలని కోరుకుంటున్నావా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  


టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్  పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్

 

స్టాండ్‌బై ఆటగాళ్లు 

ఉమేశ్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ 

Updated Date - 2022-09-18T22:24:37+05:30 IST