మాంసాన్ని అసలే తీసుకోకుండా ఉండలేం... - విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ

ABN , First Publish Date - 2022-02-10T22:12:15+05:30 IST

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జంట ఓ ప్లాంట్ ఆధారిత మీట్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ మేరకు అనుష్క శర్మ ఓ ప్రమోషనల్ వీడియోలో ఈ వివరాలను వెల్లడించారు.

మాంసాన్ని అసలే తీసుకోకుండా ఉండలేం...  - విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ

* మీట్ స్టార్టప్‌లో పెట్టుబడులు

* మరో 25-30 నగరాలకు విస్తరణ యోచన 

ముంబై : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జంట ఓ ప్లాంట్ ఆధారిత మీట్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ మేరకు అనుష్క శర్మ ఓ ప్రమోషనల్ వీడియోలో ఈ వివరాలను వెల్లడించారు. ‘ఈ గ్రహాన్ని భవిష్యత్తు తరాలకు మంచి ప్రదేశంగా ఎలా మార్చగలమన్న విషయపై నేను, విరాట్ తరుచూ మాట్లాడుకుంటాం. అందుకు మా జీవితాల్లో మేం  మార్చుకున్న అంశాల్లో ఒకటి... మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం. అయితే... మాంసాన్ని అసలే తీసుకోకుండా ఉండడబోం. ఆహార ప్రియులుగా తాము ఒక్కోసారి మాంసం రుచిని మిస్ అవుతున్నాం’... అంటూ కోహ్లీ జంట తమ డైట్ గురించి చెబుతోంది. 


ముంబై కేంద్రంగా బ్లూ ట్రైబ్ ఫుడ్స్ అనే స్టార్టప్ వివిధ నగరాల్లో సేవలనందిస్తోంది. సందీప్ సింగ్, నిక్కీ అరోరా సింగ్ దీనిని వ్యవస్థాపకులు. బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా గతేడాది తమ ప్లాంట్ బేస్డ్ మీట్ బ్రాండ్ ఇమాజిన్ మీట్స్‌ను ప్రారంభించారు. బియాండ్ మీట్ వంటి గ్లోబల్ బ్రాండ్స్ విజయాన్ని మార్కెట్‌లో ప్రతిబింబించాలని ఈ సెలెబ్రిటీలు భావిస్తున్నారు. కాగా...  ప్లాంట్ ఆధారిత మాంసానికి భారీ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇమాజిన్ మీట్స్ మాంసాహారానికి సంబంధించిన తొమ్మిది రకాలను కోహ్లి జంట ప్రమోట్ చేయనుంది. వీటిలో కీమాస్, సీక్ కబాబ్స్, బిర్యానీ వంటకాలు, నగ్గెట్స్, సాసెజ్‌లు సహా మొక్కల ఆధారిత రకాలైన సాన్స్ రియల్ మీట్ కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 25-30 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


జంతువుల పెంపకంతో ముడివడి ఉన్న కార్బన్ పుట్‌ప్రింట్‌ను తగ్గించే ఉద్దేశ్యంతో ఈ మాంసం కాని  మాంసానికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇమాజిన్ మీట్స్, వెజ్జీ చాంప్, గుడ్ డాట్ వంటి కంపెనీలు మొక్కల ఆధారిత మాంసాన్ని తీసుకు రావడంతో ఈ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది.

Updated Date - 2022-02-10T22:12:15+05:30 IST