Virat Kohli Infected With COVID-19: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్.. ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-22T23:28:34+05:30 IST

ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌ మ్యాచ్‌కు (5th Test) సమాయత్తమవుతున్న టీమిండియాకు (Team India) దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కోవిడ్-19 (Covid-19) సోకడంతో..

Virat Kohli Infected With COVID-19: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్.. ట్విస్ట్ ఏంటంటే..

ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌ మ్యాచ్‌కు (5th Test) సమాయత్తమవుతున్న టీమిండియాకు (Team India) దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కోవిడ్-19 (Covid-19) సోకడంతో టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (Aswin) స్వదేశంలోనే ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి కరోనా సోకిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ నుంచే విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల భార్య, కూతురితో కలిసి మాల్దీవ్స్ ఫ్యామిలీ ట్రిప్‌కు (Maldives) వెళ్లాడు. మాల్దీవుల నుంచి తిరిగొచ్చాక కోహ్లీ (Kohli) కరోనా (Corona) బారిన పడినట్లు సమాచారం. మాల్దీవ్స్ నుంచి తిరిగొచ్చాక ఇంగ్లండ్‌తో ఐదో మ్యాచ్ (IND vs ENG) కోసం కోహ్లీ అక్కడికి వెళ్లాడు. కోవిడ్ నుంచి కోలుకున్నాకే టీమిండియాతో కలిసి కోహ్లీ ఇంగ్లండ్‌కు వెళ్లాడని సమాచారం.



అయితే.. కోహ్లీకి కరోనా సోకినట్టుగా గానీ, కరోనా నుంచి కోలుకున్నట్టుగా గానీ బీసీసీఐ (BCCI), కోహ్లీ (Kohli) ఎలాంటి ప్రకటన చేయలేదు. సోమవారం లీసెస్టర్‌లో విరాట్ కోహ్లీ కొందరు ఫ్యాన్స్‌తో సెల్ఫీలు కూడా దిగాడు. ఇదిలా ఉంటే.. కొవిడ్‌ (Covid) భయం పెద్దగా లేకపోవడంతో భారత క్రికెటర్లు ఇంగ్లండ్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. బయోబబుల్‌ లేకుండానే ఈసారి విదేశీ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు తమ ఖాళీ సమయాల్లో షాపింగ్‌, షికార్లకు వెళుతున్నారు. అయితే ఈ సమయంలో వీరంతా కొవిడ్‌ నిబంధనలు పాటించడం మరచిపోతున్నారు. అంతేకాకుండా.. అటుగా వచ్చిన అభిమానులకు షేక్‌హ్యాండ్స్‌ ఇస్తూ ఫొటోలు సైతం దిగుతున్నారు.



స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఇలాగే ఫ్యాన్స్‌తో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral) అయ్యాయి. ఆ సమయంలో వీరికి మాస్క్‌లు (Masks) కూడా లేవు. అటు ఇలాంటి చర్యలపై బీసీసీఐ (BCCI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ విరాట్‌, రోహిత్‌లను హెచ్చరించాలని భావిస్తోంది. ‘యూకేలో కొవిడ్‌ కేసులు చాలావరకూ తగ్గినప్పటికీ క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించే బయట తిరగాలి’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ తెలిపాడు. ఇదిలా వుండగా యూకేలో ఇప్పటికీ రోజుకు 10వేల కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒకవేళ ఆటగాళ్లకు కరోనా సోకితే ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సిందే. దీనికితోడు ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టుకు (Edgbaston Test) కూడా అందుబాటులో ఉండడం కష్టమే. అందుకే కరోనా విషయంలో ఆటగాళ్లను జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు జులై 1న రీషెడ్యూల్డ్ టెస్టు ఆడుతుంది. ఆ తర్వాత మూడు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

Updated Date - 2022-06-22T23:28:34+05:30 IST