ఆ ముగ్గురు యువపేసర్లని దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడించండి.. సెలెక్టర్లకు వీరేంద్ర సెహ్వాగ్ సలహా

ABN , First Publish Date - 2022-05-01T01:12:04+05:30 IST

న్యూఢిల్లీ : ఐపీఎల్ 2022లో చక్కటి నైపుణ్యమున్న పలువురు యువక్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ప్రత్యర్థులపై మ్యాచుల్లో అద్భుతంగా రాణిస్తున్నారు.

ఆ ముగ్గురు యువపేసర్లని దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడించండి.. సెలెక్టర్లకు వీరేంద్ర సెహ్వాగ్ సలహా

న్యూఢిల్లీ : IPL 2022లో చక్కటి నైపుణ్యమున్న పలువురు యువపేసర్లు వెలుగులోకి వచ్చారు. ప్రత్యర్థులపై మ్యాచుల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆకట్టుకునే ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలో పడుతున్నారు. ముఖ్యంగా sunrisers hyderabadకు ప్రాతినిధ్యం వహిస్తున్న Umran malik, pujab kings తరపున ఆడుతున్న Arshadeep singh, Luknow super giants పేసర్ Avesh khan ముగ్గురూ విశేషంగా ఆకట్టుకుంటున్నారు. త్వరలోనే వీరు జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం ఖాయమంటూ మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌ల ప్రదర్శనపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ Virendra sehwag కూడా స్పందించాడు. Southafricaతో త్వరలో జరగబోయే T20 సిరీస్‌లో ఈ పేసర్లను ప్రయోగించాలని ఆకాంక్షించాడు. ఈ ఏడాది నిర్విరామ షెడ్యూల్ ఉండడంతో ప్రధాన బౌలర్లకు విశ్రాంతి ఇస్తే యువపేసర్లను ఆడించడం సాధ్యమవుతుందని సలహా ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే ఆటగాళ్లను దశలవారీగా సంసిద్ధం చేయవచ్చునని సెలెక్టర్లకు సూచించాడు.


‘మీరు టీ20 వరల్డ్ కప్ గురించి చర్చించుకుంటున్నారు. కానీ జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్‌లో అవకాశం ఇవ్వాలని నేను చెబుతున్నా’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అర్షదీప్ సింగ్‌పై స్పందిస్తూ.. అర్షదీప్ సింగ్ ఏవిధంగా బౌలింగ్ చేస్తాడో అందరికీ తెలుసు. దక్షిణాఫ్రికాపై ఆడించడం ద్వారా అతడికి అనుభవం కూడా వస్తుంది అని సెహ్వాగ్ అన్నాడు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌తోపాటు టీ20 సిరీస్ ఆడనున్న ప్రధాన బౌలర్లకు కూడా విశ్రాంతి ఇవ్వొచ్చు అని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022లో చక్కటి ప్రదర్శన చేస్తున్న ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌లను స్వదేశంలో జరగబోయే సిరీస్‌లో ఆడించాలని పునరుద్ఘాటించాడు. కాగా జూన్ 9 -19 మధ్య టీమిండియా - దక్షిణాఫ్రికా మధ్య 5 టీ20 సిరీస్ జరగనుంది.

Updated Date - 2022-05-01T01:12:04+05:30 IST