3డి ఆర్ట్‌లో సిద్ధహస్తుడు!

ABN , First Publish Date - 2021-01-30T05:30:00+05:30 IST

మెక్సికోకు చెందిన 31 ఏళ్ల కార్లోస్‌ ఆల్బెర్టో స్ట్రీట్‌ ఆర్ట్‌ వేయడంలో సిద్ధహస్తుడు. అతను వేసిన బొమ్మలను ఒక

3డి ఆర్ట్‌లో సిద్ధహస్తుడు!

ఈ చిత్రం చూడండి. రంగురంగుల రామచిలుక గోడ రంధ్రంలో నుంచి ఎగురుకుంటూ వస్తున్నట్టుగా ఉంది కదూ! కానీ అది ఓ చిత్రకారుడి వేసిన 3డి ఆర్ట్‌. అతడు బొమ్మ వేశాడంటే దారిన వెళుతున్న వాళ్లు ఆగి చూడాల్సిందే. పక్కన నిలుచుని సెల్ఫీలు తీసుకోవాల్సిందే.


 మెక్సికోకు చెందిన 31 ఏళ్ల కార్లోస్‌ ఆల్బెర్టో స్ట్రీట్‌ ఆర్ట్‌ వేయడంలో సిద్ధహస్తుడు. అతను వేసిన బొమ్మలను ఒక యాంగిల్‌లో నుంచి చూస్తే నిజమైనవిగా ప్రతిబింబిస్తాయి. 


 కార్లోస్‌ పక్షులు, కప్పలు, ఇతర క్షీరదాల బొమ్మలను ఎక్కువగా గోడలపై వేస్తుంటాడు. ఎలా వేస్తే బొమ్మకు రియలిస్టిక్‌ లుక్‌ వస్తుందో ముందే ఒక అవగాహనకు వస్తాడు. ఆ తరువాత చకచకా పని కానిచ్చేస్తాడు.


 కార్లోస్‌కు బాల్యంలోనే డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పట్ల మక్కువ ఏర్పడింది. ఎక్కువ సమయం ఏదో ఆర్ట్‌ వేసుకుంటూ సమయం గడిపేవాడు. రకరకాల ఆర్ట్‌ కాంపిటీషన్లలో పాల్గొనేవాడు.


 


సాధారణంగా 3డి ఆర్ట్‌ వేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ కార్లోస్‌ చాలా తక్కువ సమయంలో పని పూర్తి చేస్తాడు. ఇంటర్నేషనల్‌ స్ట్రీట్‌ పెయింటింగ్‌ పోటీల్లోనూ పాల్గొన్నాడు.


Read more