విశాఖ: పీఎం పాలెం, గాయిత్రినగర్‌లో వివాదస్పద స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తహశీల్థారు రామారావు నేతృతంలో అధికారుల బృందం పరిశీలించింది. ఎంవీవీ బిల్డర్స్ సంస్థపై నిన్న (ఆదివారం) ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు.
పీఎం పాలెం, గాయత్రి నగర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు... ఎంవీవీ బిల్డర్ సంస్థపై నగర కమిషనర్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన, ఎంవీవీ బిల్డర్స్ వెంచర్‌కు తమ స్థలంలో నుంచి రోడ్డు వేసి కల్వర్టు నిర్మించారని ఎస్పీ ఫిర్యాదు చేశారు. ఒక ప్రైవేటు స్థలంలో రోడ్డు ఎలా వేస్తారు?.. కల్వర్ట్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. వెంటనే తొలగించాలని ఎస్పీ మధు డిమాండ్ చేశారు. మరోవైపు వెంచర్‌కు అడ్డంగా ఉందని, ప్రభుత్వం రోడ్డును కలిపేసారని, తమకు రోడ్డు లేకుండా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.