నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు

ABN , First Publish Date - 2020-08-09T10:46:43+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవ హరించి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ..

నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు

విజయనగరం క్రైం: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవ హరించి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని,  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగిలిన సమయాల్లో బటయకు రావొద్దని సూచించా రు.. పోలీసులు ప్రాణాలు లెక్కచేయకుండా నిత్యం రోడ్లపై విధులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో ఇంకా మార్పు కన్పించడం లేదన్నారు. జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం వద్దని తెలిపారు. మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు. మధు మేహం, గుండె జబ్బు, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు మరింత అప్ర మత్తంగా ఉండాలన్నారు.  పోలీసులకు సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-08-09T10:46:43+05:30 IST