‘విశాఖ’ పరిరక్షణకు గొంతెత్తాలి

ABN , First Publish Date - 2021-03-01T05:46:31+05:30 IST

విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడానికి రాష్ట్ర ప్రజానీకం గొంతెత్తాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు.

‘విశాఖ’ పరిరక్షణకు గొంతెత్తాలి

  • సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 28: విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడానికి రాష్ట్ర ప్రజానీకం గొంతెత్తాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. ఆదివారం జట్ల లేబర్‌ యూనియన్‌ కార్యాలయంలో హమాలీ కార్మికుల సమావేశం యూనియన్‌ అధ్యక్షుడు కూండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని తిప్పికొట్టడానికి కార్మికులు సిద్ధం కావాలని మధు అన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మార్చి 5న జరిగే రాష్ట్ర బంద్‌కు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. ప్రజలు పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్‌ సంస్థలకు అమ్మాలను కోవడం దారుణమన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నల్లా రామారావు, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, ఉపాధ్యక్షుడు పెంట దేవుడు, వెంకట్రావు, సహాయ కార్యదర్శి మోహనకృష్ణ, రెడ్డి వెంకటరావు, కోశాధికారి కాళ్ల అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:46:31+05:30 IST