
మచిలీపట్నం టౌన్, జూన్ 27 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపు చేయాలంటూ ఏఐటీయూసీ, సీఐటీ యూ, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు బందరు రేవతీ సెంటర్లో సోమవారం ధర్నా నిర్వహించారు. విశాఖ ఉద్యమం 500 రోజులు పూర్తయిన సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏఐటీయూసీ నేత మోదుమూడి రామారావు, సీఐటీయూ నేత బి. సుబ్రహ్మణ్యం, టీఎ న్టీయూసీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పంచపర్వాల కాశీవిశ్వనాథం మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలన్నారు. టి. తాతయ్య, మాదాల వెంకటేశ్వరరావు, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కార్యదర్శి జి. కిషోర్‌కుమార్, పి. పవన్, కె.వి.గోపాలరావు, అరుణ్‌కుమార్, కరపాటి సత్యనారాయణ, వై.ఈశ్వరరావు, సిహెచ్. రాజేష్, టి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.