జాబ్ క్యాలెండర్‌‌‌పై అసంతృప్తి...నిరుద్యోగుల భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2021-06-21T17:27:13+05:30 IST

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరుద్యోగులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.

జాబ్ క్యాలెండర్‌‌‌పై అసంతృప్తి...నిరుద్యోగుల భారీ ర్యాలీ

విశాఖపట్నం: ప్రభుత్వం విడుదల చేసిన  జాబ్ క్యాలెండర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరుద్యోగులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ గ్రూప్‌‌లో పోస్ట్ 36 విడుదల చేయడం సిగ్గు చేటన్నారు. డీఎస్సీ , పోలీస్, గ్రూప్ వన్ గ్రూప్‌తో పాటుగా, గ్రూప్ టూ,  గ్రూప్ ఫోర్ ఖాళీలు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-06-21T17:27:13+05:30 IST