Visakha: పెందుర్తి రామాలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-08-17T16:41:52+05:30 IST

నగరంలోని పెందుర్తి 96వ వార్డు పాత పెందుర్తి రామాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.

Visakha: పెందుర్తి రామాలయంలో చోరీ

విశాఖపట్నం: నగరంలోని పెందుర్తి 96వ వార్డు పాత పెందుర్తి రామాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. గత రాత్రి గుడిలోకి ప్రవేశించిన దుండగులు హుండీ పగుల గొట్టి సుమారు ఇరవై వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-08-17T16:41:52+05:30 IST