విశాఖపట్నం: ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థిని మిస్బా చదువులో రాణించడం కూడా తప్పేనా జగన్ రెడ్డి? అంటూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రణవ్ గోపాల్ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మహిళా సంక్షేమం ఇదేనా? అని నిలదీశారు. వైసీపీకి మైనార్టీలు ఓటు వేసిన పాపానికి చదువులో రాణించడం కూడా నేరమే అంటే ఎలా? అని అన్నారు. మిస్బా ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేత సునీల్, ప్రిన్సిపాల్ రమేష్‌లను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. మిస్బా కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలన్నారు. మిస్బా కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు టీఎన్ఎస్ఎఫ్ పోరాడుతుందని ప్రణవ్ గోపాల్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి