
విశాఖపట్నం: పాత గాజువాకలో విశాఖ బంద్‌లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అలాగే సార్వత్రిక సమ్మెకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... విశాఖ బంద్‌పై వైసీపీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందన్నారు. విశాఖలో ఆర్టీసీ బస్సులు యధాతధంగా తిరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ నేతలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావడం లేదని మండిపడ్డారు. సార్వత్రిక సమ్మెను, విశాఖ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీ లు మద్దతు ఇస్తున్నా వైసీపీ మద్దతు ఇవ్వడం లేదన్నారు. జగన్ సర్కార్ మద్దతుతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని విమర్శించారు. వైసీపీ వైఖరిని నిరసిస్తూ విజయ సాయి రెడ్డి ఇళ్లతో సహా వైసీపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి