విశాఖపట్నం: విశాఖ పాత గాజువాకలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది. విశాఖ బంద్‌లో ఉదయం నుంచి టీడీపీ నేతలు పాల్గొనగా...వైసీపీ నేతలు బంద్‌కు దూరంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ వైఖరిని టీడీపీ నేతలు తప్పు బట్టారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల నుంచి పార్టీ జెండాలను వైసీపీ కార్యకర్తలు లాగిపారేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. వైసీపీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని... వైసీపీ కార్యకర్తలు తాగి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి