AP News: విశాఖ విక్టోరియా ఆస్పత్రి వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు.. ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-09-16T19:14:26+05:30 IST

నగరంలోని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి వద్ద టీడీపీ సభ్యులు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

AP News: విశాఖ విక్టోరియా ఆస్పత్రి వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు.. ఉద్రిక్తత

విశాఖపట్నం: నగరంలోని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి వద్ద టీడీపీ సభ్యులు (TDP Leaders) అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ బ్యానర్‌ను పోలీసులు తీసుకువెళ్లడంపై తెలుగు దేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చివరకు పోలీసులు బ్యానర్ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్ గండి బాబ్జి, శ్రీ భరత్, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-16T19:14:26+05:30 IST