మృతుడు సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు మంత్రి అవంతి హామీ

ABN , First Publish Date - 2021-11-10T15:29:15+05:30 IST

సూర్యనారాయణ అనే వ్యక్తి మృతదేహంతో కుటుంబసభ్యులు తన ఇంటి ముందు ఆందోళనకు దిగడంపై మంత్రి అవంతి స్పందించారు.

మృతుడు సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు మంత్రి అవంతి హామీ

విశాఖపట్నం: సూర్యనారాయణ అనే వ్యక్తి మృతదేహంతో కుటుంబసభ్యులు  తన ఇంటి ముందు ఆందోళనకు దిగడంపై మంత్రి అవంతి స్పందించారు. మృతుడి సూర్యనారాయణ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇద్దరు కుమార్తెల పేరు మీద  చెరో రూ.5 లక్షలు, ఒక స్థలం, జీవీఎంసీలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులను అడిగితే చెబుతారన్నారు. అయితే సూర్యనారాయణను ఢీ కొట్టిన వాహనంలో తాను లేనని మంత్రి అవంతి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-10T15:29:15+05:30 IST