ఇల్లు అంటే శాశ్వత చిరునామా, మహిళలకు సామాజిక హోదా: సీఎం జగన్‌

ABN , First Publish Date - 2022-04-28T20:10:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఇల్లు అంటే శాశ్వత చిరునామా, మహిళలకు సామాజిక హోదా: సీఎం జగన్‌

విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం, పైడివాడ అగ్రహారంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ ఇల్లు అంటే శాశ్వత చిరునామా అని, మహిళలకు సామాజిక హోదా అని పేర్కొన్నారు. ఇళ్ల పంపిణీని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇకపై శాశ్వత చిరునామా లేని కుటుంబం ఉండకూడదని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్లు కట్టి ఇస్తానని పాదయాత్రలో చెప్పానని, ఇప్పటి వరకు 30.70 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ చేశామని పేర్కొన్నారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఇక రెండో దశ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయని, ఎన్ని అడ్డంకులు వచ్చినా అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీపడనని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-28T20:10:09+05:30 IST