Visakha: అప్పన్న చందనోత్సవానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-05-03T19:45:52+05:30 IST

విశాఖ: సింహాచలం అప్పన్న చందనోత్సవానికి భక్తులు పోటెత్తారు.

Visakha: అప్పన్న చందనోత్సవానికి పోటెత్తిన భక్తులు

విశాఖ: సింహాచలం అప్పన్న చందనోత్సవానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అపరిచితుల కదలికలపై భక్తులు జాగ్రత్తగా ఉండాలని విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సుమారు 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సామాన్యులకు త్వరితగతిన స్వామి దర్శనం లభించే ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 


సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం, రూ. 300 టిక్కెట్ తీసుకున్న భక్తులకు 30 నిముషాలు, రూ. 12వందల టిక్కెట్ తీసుకున్నవారికి డైరెక్టుగా స్వామి వారి దర్శనం జరగుతుందని శ్రీకాంత్ తెలిపారు. వీఐపీలకు తెల్లవారు జాము 4 గంటల నుంచి 6 గంటల వరకు.. అలాగే 7 గంటల నుంచి 9 గంటల వరకు మరో సమయం కేటాయించినట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు.

Read more