Visakha: కేరళ (Kerala)లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న తేది కన్నా మూడు రోజుల ముందే ప్రవేశించాయన్నారు. కేరళలో పలు జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో కేరళ అంతటా విస్తరించే అవకాశం ఉందని, వారం రోజుల తర్వాత క్రమంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి