విశాఖ: పర్యాటకం ముసుగులో ఏపీ పరిపాలన రాజధాని పనులు..!

ABN , First Publish Date - 2021-10-24T17:51:10+05:30 IST

విశాఖ: నగరంలో పరిపాలన రాజధాని పనులు ఊపందుకున్నాయా? పర్యాటకం ముసుగులో...

విశాఖ: పర్యాటకం ముసుగులో ఏపీ పరిపాలన రాజధాని పనులు..!

విశాఖ: నగరంలో పరిపాలన రాజధాని పనులు ఊపందుకున్నాయా? పర్యాటకం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా పనులు కానిచ్చేస్తున్నారా? కార్యాలయాల కోసం భవనాల పరిశీలన జరుగుతోందా? అసలు తెర వెనుక ఏం జరుగుతుంది?  విశాఖ రుషికొండలో ఉన్న హరితా బీచ్ రిసార్డ్స్‌ను గతంలో ప్రభుత్వం కూల్చివేసింది. ఇప్పుడది నిర్మాణం చేయడానికి వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.


త్వరలో విశాఖ నుంచే పరిపాలన అని అధికారపార్టీ పెద్దలు గతంలో పలుమార్లు ప్రకటించినా.. ఇప్పుడు ఆ ప్రస్తావన తేవడంలేదు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరో వైపు కోర్టు కేసులతో పరిపాలన రాజధాని ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అయితే దానికి సంబంధించిన పనులు మాత్రం పర్యాటకం ముసుగులో పరుగులు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, ఇతర అధికారుల కార్యాలయాల కోసం పలు భవనాలు పరిశీలించి రిజర్వు చేసుకుంటున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2021-10-24T17:51:10+05:30 IST