
విశాఖపట్నం: మహిళలకు జగన్ సర్కార్ తోడుగా ఉంటుందని..ప్రతిపక్షాలు విమర్శలు ఆపాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 26 నెలల జగన్ పరిపాలనలో మహిళా సంక్షేమాని పెద్దపీట వేశారని తెలిపరు. రాజకీయ పదవుల్లో సమాన భాగస్వామ్యం కల్పించామని చెప్పుకొచ్చారు. మహిళలు అందరికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 30 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. మహిళ ఉద్యోగుల వేధింపులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని తెలిపారు. మహిళా సాధికారత కోసం మహిళా కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, చర్చా గోష్ఠులు నిర్వహిస్తుందన్నారు. టెక్నాలజి, సామాజిక మాద్యమాలు వలన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగినా స్పందించని చంద్రబాబు... ఇప్పుడు విమర్శలు చేయడం సమంజసం కాదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.