ముగిసిన వెంకయ్య పర్యటన

Published: Sat, 26 Feb 2022 09:43:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ముగిసిన వెంకయ్య పర్యటన

                     - విమానాశ్రయంలో గవర్నర్‌ సాదర వీడ్కోలు


చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చెన్నై పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 13వ తేదీన చెన్నై వచ్చిన వెంకయ్య.. నగరంలోని ఓ హోటల్లో జరిగిన తన మనవరాలి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. అనంతరం రాజ్‌భవన్‌ నుంచి ప్రత్యక్ష, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 13 రోజుల పర్యటన ముగించుకున్న వెంకయ్య దంపతులు.. శుక్రవారం ప్రత్యేక విమానంలో బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. ఆయనకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.