వివాదాస్పదంగా మారిన ఆంధ్రా యూనివర్సిటీ వీసీ వైఖరి

ABN , First Publish Date - 2021-03-01T01:31:10+05:30 IST

అదొక కుల సమావేశం. పైగా రాజకీయంతో పెనవేసుకున్న కుల సమావేశం. అందులోనూ కీలక వ్యక్తి. ఉత్తరాంధ్ర వైసీపీ రెడ్డిరాజుగారు విజయసాయి పాల్గొన్న సమావేశం. ఆ సమావేశంలో...

వివాదాస్పదంగా మారిన ఆంధ్రా యూనివర్సిటీ వీసీ వైఖరి

విశాఖ: అదొక కుల సమావేశం. పైగా రాజకీయంతో పెనవేసుకున్న కుల సమావేశం. అందులోనూ కీలక వ్యక్తి. ఉత్తరాంధ్ర వైసీపీ రెడ్డిరాజుగారు విజయసాయి పాల్గొన్న సమావేశం. ఆ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగి. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన వ్యక్తి, ఆంధ్రాయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఎంచక్కా మీటింగ్‌లో పాల్గొనడమే కాదు. విజయసాయిరెడ్డితో ఊసులు చెప్పుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా నవ్వుతూ ఊగిపోతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ట్రోలింగ్‌కు కూడా గురవుతోంది. అసలు ‘‘వీసీ ఏంటి?. రాజకీయ సమావేశంలో పాల్గొనడమేంటి?. పైగా కులంతో జత కట్టేందుకు రాజకీయ సమావేశంలో పాల్గొనడమేంటి‘‘ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ సమావేశంలోనే విజయసాయిరెడ్డి.. రెడ్లంతా వైసీపీ వారికే ఓటు వేయాలని పిలుపునిచ్చి వివాదం సృష్టించారు. 

Updated Date - 2021-03-01T01:31:10+05:30 IST