పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2021-05-15T05:53:09+05:30 IST

సామర్లకోట, మే 14: విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తూ సికింద్రాబాద్‌ రైల్వే ఎస్టీఎం ఎన్‌కే మురళీధరన్‌ నాయర్‌ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్‌కు ఉత్తర్వులు అందాయి. కరోనా వ్యాప్తి, పాక్షిక కర్ఫ్యూ

పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

సామర్లకోట, మే 14: విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తూ సికింద్రాబాద్‌ రైల్వే ఎస్టీఎం ఎన్‌కే మురళీధరన్‌ నాయర్‌ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్‌కు ఉత్తర్వులు అందాయి. కరోనా వ్యాప్తి, పాక్షిక కర్ఫ్యూ కారణంగా ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో ఆక్యుపెన్సీ దృష్ట్యా రైల్వే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 


విశాఖ-లింగంపల్లి మధ్య నడిచే 12831 నెంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 31 వరకు రద్దు చేశారు.

లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే 02832 నెంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును శనివారం నుంచి జూన్‌ 1 వరకు రద్దు చేశారు.

విశాఖపట్నం-కడప మధ్య నడిచే 07488 నెంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును జూన్‌ 1 వరకు రద్దు చేశారు. 

కడప-విశాఖపట్నం మధ్య నడిచే 07487 నెంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును శనివారం నుంచి జూన్‌ 1 వరకు రద్దు చేశారు. 

విశాఖ, కాకినాడల నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే విశాఖ, గౌతమి, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే సామర్లకోట మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.


Updated Date - 2021-05-15T05:53:09+05:30 IST