Advertisement

విశాఖ ఫార్మా కంపెనీ వద్ద టీడీపీ నేతను అడ్డుకున్న పోలీసులు

Jun 30 2020 @ 10:22AM

విశాఖపట్నం: విశాఖ సాయినగర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో ప్రమాదాన్ని పరిశీలించేందుకు వచ్చిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ లోపలకు ఎవరిని వెళ్లనివ్వకుండా బారికేడ్లు, రోప్ పార్టీతో ప్రవేశ మార్గాన్ని పోలీసులు మూసివేశారు. కంపెనీ లోపలకు వెళ్లేందుకు పై అధికారులతో చర్చించిన తర్వాత అనుమతిస్తామని మాజీ మంత్రి బండారుకు పోలీసులు తెలియజేశారు. గతంలో ఇప్పుడు ఇటువంటి పరిస్థితి లేదని... పోలీసులతో అడ్డుకోవడం చాలా దారుణమని బండారు సత్యనారాయణ మండిపడ్డారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.