విశాల్ అనవసరంగా భయపడుతున్నాడు : ఆర్‌.బి.చౌదరి

Jun 12 2021 @ 21:05PM

విశాల్ అనవసరంగా భయపడుతున్నాడు అని ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి అన్నారు. రీసెంట్‌గా విశాల్‌, ఆర్‌.బి.చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అప్పు చెల్లించినప్పటికీ ప్రామిసరీ నోటును తిరిగి ఇవ్వకుండా చౌదరి నన్ను ఇబ్బంది పెడుతున్నారని విశాల్‌ ఆరోపించారు. తాజాగా ఈ విషయమై నిర్మాత చౌదరి స్పందించారు. ఇది కేవలం చిన్న విషయమేనని.. మేము ఇప్పటివరకూ విశాల్‌ని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని ఆయన అన్నారు.


'ఇరుంబు తిరై' అనే చిత్ర షూటింగ్ సమయంలో డబ్బు అవసరమైతే నేను, తిరుప్పూర్‌ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విశాల్‌కు  అప్పుగా ఇచ్చాం. అప్పు తీసుకున్న సమయంలో విశాల్‌ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేసి ఇచ్చాడు. ఆ తర్వాత విశాల్‌ తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని కూడా మేము ఓ డాక్యుమెంట్స్‌పై రాసి సంతకాలు పెట్టాం. ఆ డాక్యుమెంట్స్ దర్శకుడు శివకుమార్‌ దగ్గర దాచాము. అయితే, శివకుమార్‌ ఆకస్మిక మరణంతో ఆ కాగితాలు ఎక్కడ దాచారో మాకు తెలియలేదు. దాంతో మేము వాటిని విశాల్‌కు తిరిగి ఇవ్వలేకపోయాం. అదే విషయాన్ని ఆయనతో చెప్పాం. కానీ వినిపించుకోలేదు. ఆ డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయని.. వాటితో మేము ఏదైనా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని విశాల్‌ భయపడుతున్నారు. నిజంగానే ఆ డాక్యుమెంట్స్‌ మా వద్ద లేవు. ఇప్పుడు ఈ సమస్యే కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.. అని చౌదరి పేర్కొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.