ఇటు వంటి డ్రామాలు Jagan గతంలో కూడా ఆడారు: Vishnuvardhan Reddy

ABN , First Publish Date - 2022-06-05T21:05:17+05:30 IST

జేపీ నడ్డా పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితమైన మార్పుకు సంకేతమని

ఇటు వంటి డ్రామాలు Jagan గతంలో కూడా ఆడారు: Vishnuvardhan Reddy

Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పర్యటన ఖచ్చితమైన మార్పుకు సంకేతమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రోడ్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతారన్నారు. 2024 ఎన్నికలకు దశాదిశా నిర్దేశం చేస్తారన్నారు. ఎన్నికలకు సన్నద్దం అయ్యేలా క్యాడర్‌ను సిద్దం చేస్తారని చెప్పారు. నడ్డా ఏపీ కార్యక్రమం ఖరారు కాగానే సీఎం జగన్ డిల్లీ పర్యటన పెట్టుకున్నారన్నారు. ఇటు వంటి డ్రామాలు ముఖ్యమంత్రి గతంలో కూడా ఆడారన్నారు. డైవర్ట్ పాలిటిక్స్‌తో సీఎం మాయ చేస్తున్నారని, పొలిటికల్ మైండ్ గేమ్‌ను‌ వైసీపీ ప్రారంభించిందన్నారు. బీజేపీ పెద్దలతో అన్నీ మాట్లాడినట్లు చెప్పుకుంటారని, కానీ ఆ వివరాలు ఏవీ కూడా మీడియాకు చెప్పరని, ఏపీలో బీజేపీపై జగన్ చేస్తున్న కుట్ర ఇదని, గతంలో టీడీపీ కూడా ఇలానే మాయ చేసిందని విమర్శించారు.


రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు తమకు మద్దతు ఇచ్చే పార్టీలు చాలా ఉన్నాయని, అయినా వైసీపీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపతి అంశాన్ని తెర మీదకి తెస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ అంటే రాష్ట్ర ప్రజలు జగన్‌కి అధికారం ఇచ్చారన్నారు. ఇప్పుడు జనసేన, బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. 2024లో బీజేపీ, జనసేన కలిసే అధికారంలోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీపై బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-06-05T21:05:17+05:30 IST