
హైదరాబాద్ (Hyderabad): కాంగ్రెస్ (Congress)లో తమకు రాహుల్ గాంధీ (Rahul Gandhi)యే బాస్ అని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఆక్టీవ్గానే ఉంటున్నానని చెప్పారు. చాలా మంది పీజేఆర్ (PJR) పేరు వాడుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. పీజేఆర్ అంటే ఒక చరిత్ర అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచే చేస్తానన్నారు. తనకూ.. టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. ఇవాళ్టి లంచ్‌కు ఆయనకు కూడా అహ్వనం ఇచ్చామన్నారు. ఆయన ఢిల్లీలో ఉండటం వల్ల రాలేదన్నారు. తన సోదరి విజయారెడ్డి విషయంలో తన కార్యకర్తలు ఎలా చెప్తే అలా నిర్ణయం తీసుకుంటానన్నారు. ఆమెను పార్టీలోకి తీసుకొనే ముందు తనను ఎవరు అడగలేదన్నారు. తాను టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP)లోకి వెళ్ళే ప్రసక్తి లేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి