Gujarat: రాహుల్ పర్యటనకు ముందే షాక్.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

ABN , First Publish Date - 2022-09-05T01:12:56+05:30 IST

గుజరాత్ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సిన్హ్ వాఘేలా..

Gujarat: రాహుల్ పర్యటనకు ముందే షాక్.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సిన్హ్ వాఘేలా (Vishwanathsinh Vaghela) తన పదవికి ఆదివారంనాడు రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్‌లో పర్యటించడానికి ఒకరోజు ముందే ఆయన రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 35 ఏళ్ల వాఘేలా ఈ ఏడాది జనవరిలోనే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.


కాగా, కాంగ్రెస్ పార్టీ ''భారత్ జోడో యాత్ర'' త్వరలో ప్రారంభం కానుండటం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్న నేపథ్యంలో ఈనెల 5న అహ్మదాబాద్‌లోని సబర్మతి రీవర్‌ప్రెంట్ వద్ద 'పరివర్తన్ సంకల్ప్' సదస్సులో రాహుల్ పాల్గోనున్నారు. బూత్ స్థాయి కార్యకర్తలకు రాహుల్ ఈ సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు.


బీజేపీ స్పందన

రాహుల్ పర్యటనకు ఒకరోజు ముందే వాఘేలా రాజీనామా చేయడంపై బీజేపీ ప్రతినిధి రుత్విజ్ పటేల్ స్పందించారు.  రాహుల్ ప్రచారానికి రాక ముందే రాష్ట్రంలో క్విట్ కాంగ్రెస్ ప్రచారం నడుస్తోందని అన్నారు.

Updated Date - 2022-09-05T01:12:56+05:30 IST