కొందుర్గ్‌లో ‘విజన్‌ స్పార్క్‌’ ప్రాజెక్ట్‌

ABN , First Publish Date - 2022-06-25T09:08:03+05:30 IST

స్థిరాస్తి రంగంలో పాతికేళ్ల అనుభవం ఉన్న విజన్‌ గ్రూప్‌ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండల కేంద్రంలో 30 ఎకరాల్లో చేపట్టిన ఈ ఇండిపెండెంట్‌ హౌసింగ్‌ ప్రాజెక్టు అందర్నీ ఆకర్షిస్తోంది.

కొందుర్గ్‌లో ‘విజన్‌ స్పార్క్‌’ ప్రాజెక్ట్‌

స్థిరాస్తి రంగంలో పాతికేళ్ల అనుభవం ఉన్న విజన్‌ గ్రూప్‌ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండల కేంద్రంలో 30 ఎకరాల్లో చేపట్టిన ఈ ఇండిపెండెంట్‌ హౌసింగ్‌ ప్రాజెక్టు అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తవుతాయని విజన్‌ ఇండియా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగం తిరుపతి రెడ్డి చెప్పారు. విల్లాల నిర్మాణాలను వచ్చే ఏడాది డిసెంబరు కల్లా పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.

మధ్యతరగతికి అందుబాటులో: మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా విజన్‌ గ్రూప్‌ ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతోంది. ఒక్కో విల్లాను 183 చదరపు గజాల్లో వెయ్యి చదరపు అడుగుల స్పేస్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఒక్కో విల్లాను రూ.36 లక్షలకు విక్రయిస్తోంది. ప్లాట్లను చదరపు గజం రూ.9,999 చొప్పున విక్రయిస్తోంది. దాదాపు 400 ప్లాట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే 30 ప్లాట్లు బుక్‌ అయ్యాయి. గత పాతికేళ్లలో విజన్‌ గ్రూప్‌ హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల 16 లేఅవుట్లు, 80 అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్టులు పూర్తి చేసిందని తిరుపతి రెడ్డి చెప్పారు. 


ప్రాజెక్ట్‌ లొకేషన్‌ ప్రత్యేకతలు..

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎదురుగా ప్రాజెక్ట్‌

ఎంఎంటీఎస్‌ ద్వారా షాద్‌నగర్‌తో లింక్‌

45 నిమిషాల డ్రైవ్‌లో విమానాశ్రయం

సమీపంలోనే షాద్‌నగర్‌ జూ పార్కు

10-15 నిమిషాల దూరంలో షాద్‌నగర్‌ బస్‌,రైల్వే స్టేషన్లు

ప్రాజెక్టుకు దగ్గర్లోనే జిమ్స్‌ మెడికల్‌ కాలేజీ

దగ్గర్లోనే నాట్కో ఫార్మా స్కూలు


ప్రత్యేకతలు..

డీటీసీపీ ఆమోదిత  లేఅవుట్‌

టీఎస్‌ రెరా నుంచి ప్రాజెక్ట్‌కు అనుమతి

సోలార్‌ ఫెన్సింగ్‌తో ప్రాజెక్ట్‌ చుట్టూ ప్రహరీ గోడ

పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ

నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా,స్ట్రీట్‌ లైటింగ్‌ సదుపాయం

ప్రాజెక్ట్‌లో సీసీ రోడ్లు

ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ద్వారా నిరంతరం నీటి సరఫరా

రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అవెన్యూ ప్లాంటేషన్స్‌

ప్రాజెక్ట్‌కు దగ్గర్లోనే ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, ఇస్రో కేంద్రాలు

సమీపంలోనే 44వ నంబరు జాతీయ రహదారి

Updated Date - 2022-06-25T09:08:03+05:30 IST