Vistara flight: విస్తారా విమానం కాక్‌పిట్‌లో విజిల్ సౌండ్..మధ్యలోనే తిరిగి వచ్చిన వైనం

ABN , First Publish Date - 2022-09-06T13:12:09+05:30 IST

ఢిల్లీ-ముంబై(Delhi-Mumbai) విస్తారా విమానంలో(Vistara flight) ఏర్పడిన సాంకేతిక లోపంతో...

Vistara flight: విస్తారా విమానం కాక్‌పిట్‌లో విజిల్ సౌండ్..మధ్యలోనే తిరిగి వచ్చిన వైనం

న్యూఢిల్లీ: ఢిల్లీ-ముంబై(Delhi-Mumbai) విస్తారా విమానంలో(Vistara flight) ఏర్పడిన సాంకేతిక లోపంతో మధ్యలోనే ఢిల్లీకి తిరిగివచ్చింది.(returns midway) బోయింగ్ 737 విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్ కాక్‌పిట్ కుడి వైపున విజిల్ శబ్దం వినిపించడంతో(whistling sound in cockpit) మధ్యలోనే ఢిల్లీకి(Delhi) తిరిగి వచ్చింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) (Directorate General of Civil Aviation)విచారణకు ఆదేశించింది.(ordered a probe)విమానాన్ని ప్రాథమికంగా పరిశీలించినప్పుడు ఎలాంటి నిర్మాణ లోపం కనిపించనప్పటికీ డీజీసీఏ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.


ఢిల్లీ విమానాశ్రయంలో విస్తారా విమానం సురక్షితంగా ల్యాండ్ చేశారని డీజీసీఏ అధికారులు చెప్పారు. న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి ముంబయికు వెళ్లేందుకు విస్తారా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లోపాన్ని గుర్తించిన పైలట్ ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. విమాన ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చేందుకు వీలుగా ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశామని విస్తారా ఎయిర్ లైన్స్ వెల్లడించింది. 


Updated Date - 2022-09-06T13:12:09+05:30 IST