హనుమంతసేవలో విఠలేశ్వరుడు

ABN , First Publish Date - 2021-06-23T03:37:29+05:30 IST

పండ్రంగి గ్రామ సమీపంలో వెలసిన పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం విఠలేశ్వరుడికి సీతారామపురం పడమటివీధివారు హనుమంతసేవ నిర్వహించారు.

హనుమంతసేవలో విఠలేశ్వరుడు
ప్రత్యేక అలంకరణలో పాండురంగ విఠలేశ్వరస్వామి

సీతారామపురం, జూన్‌ 22 : పండ్రంగి గ్రామ సమీపంలో వెలసిన పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం విఠలేశ్వరుడికి సీతారామపురం పడమటివీధివారు హనుమంతసేవ నిర్వహించారు. రెండో రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించగా, రాత్రి ఉభయకర్తలు హనుమంతసేవ నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - 2021-06-23T03:37:29+05:30 IST