గుడ్డు వెరీగుడ్‌!

ABN , First Publish Date - 2021-01-16T19:25:30+05:30 IST

పోషకాలు, శక్తి నిండిన గుడ్డు పౌష్ఠికాహారమని, ఆరోగ్యానికి మంచిదని తెలుసు. చలికాలంలో గుడ్లు తింటే శరీరం వెచ్చగా ఉండడమే కాదు ఇతర లాభాలు ఉన్నాయి అంటున్నారు

గుడ్డు వెరీగుడ్‌!

పోషకాలు, శక్తి నిండిన గుడ్డు పౌష్ఠికాహారమని, ఆరోగ్యానికి మంచిదని తెలుసు. చలికాలంలో గుడ్లు తింటే శరీరం వెచ్చగా ఉండడమే కాదు ఇతర లాభాలు ఉన్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. వారు ఏం చెబుతున్నారంటే...


చలికాలంలో రోజుకు ఒక గుడ్డు తింటే ఏడు గ్రాముల నాణ్యమైన ప్రొటీన్‌తో పాటు ఐదు గ్రాముల ఫ్యాట్‌ శరీరానికి అందుతుంది. హానికర క్రిముల నుంచి శరీరానికి రక్షణ అందించే యాంటీ బాడీల తయారీకి ప్రొటీన్‌ ఎంతో అవసరం. 

ఈ సీజన్‌లో కణాల ఉత్పత్తికి కొవ్వు అవసరం. అది గుడ్డులో పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు గుడ్డులోని జింక్‌ ఈ కాలంలో ఎక్కువగా వేధించే జలుబును నివారిస్తుంది. 

గుడ్డు తింటే చలికాలంలో విటమిన్‌ డి లోపం ఏర్పడదు. రోజూ అవసరమైన డి విటమిన్‌లో పది శాతం గడ్డులోనే లభిస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడే బి6, బి 12 విటమిన్లు గుడ్డులో లభిస్తాయి. 

ఉడకబెట్టిన గుడ్లు తినేవాళ్లకు మీల్‌ ప్లాన్‌ ఉంటుంది. దాని ప్రకారం రోజుకు ఆరు వరకూ ఉడికించిన గుడ్లు తినొచ్చు. అయితే పరిమితికి మించి గుడ్లు తింటే శరీరంలో కొవ్వు చేరే అవకాశం ఉందంటున్నారు ఆహారనిపుణులు.


Updated Date - 2021-01-16T19:25:30+05:30 IST